మునగాల, 9 September
మునగాల మండలంలో వర్షాలు లేక పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి 30 వేల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని, మండలాన్ని మండలంగా ప్రకటించాలని రైతు సంఘం డిమాండ్ చేసింది.
పంటల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. పంట నష్టపోయిన రైతులకు 30 వేల రూపాయలు నష్టపరిహారం అందించాలి.. మునగాల మండలాన్ని మండలంగా ప్రకటించాలని డిమాండ్... రైతు సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు బుర్రి శ్రీరాములు. పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి శ్రీరాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని సోమవారం సిపిఎం పార్టీ కార్యాలయంలో రైతు సంఘం మండల అధ్యక్షులు చందా చంద్రయ్య అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మునగాల మండల వ్యాప్తంగా పూత పిందె దశలో ఉన్న పత్తి వర్షాలు లేక పూర్తిగా ఎండిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారని ఆయన అన్నారు. వ్యవసాయ ఆధారిత పంటలను వ్యవసాయ అధికారులు పరిశీలించి ఎకరానికి 30 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు. అదేవిధంగా మునగాల మండలాన్ని మండలం గా ప్రకటించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ ను రద్దుచేసి సొసైటీల ద్వారా ఎరువులను రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. త్రాగునీటి కోసం విడుదల చేసిన చెరువులు కుంటలు నింపితే వాటిని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు స్టాలిన్, రామకృష్ణారెడ్డి,మండవ వెంకటాద్రి,డివైఎఫ్ఐ నాయకులు గడ్డం వినోద్ తదితరులు పాల్గొన్నారు..












